![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1021 లో.. అసలు ఈ పోస్టర్లు ఎవరు చేంజ్ చేశారని రాజీవ్, శైలేంద్ర అనుకుంటు ఉంటే నేనే చేసానంటు మను వస్తాడు. నువు పోస్టర్ ప్రింట్ చెయ్యడానికి వెళ్ళినపుడే అక్కడ నేను నిన్ను చూసానంటూ రాజీవ్ పోస్టర్లు అంటిస్తున్నప్పడు మను తీసిన వీడియోని వాళ్లకి చూపిస్తాడు. ఆ వీడియో చూసి ముందే చెప్పొచ్చు కదా.. ఇంత వరకు వచ్చాక చెప్పావ్ డబ్బులు అన్న సేవ్ అయ్యేవి కదా అని మనుతో శైలేంద్ర అంటాడు.
ఆ తర్వాత నువు ఇలా ప్రతీ దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని మనుపై శైలేంద్ర కోప్పడతాడు. నువు అసలు కాలేజీ కోసం యాభై లక్షలు ఇవ్వలేదని చెప్తానని శైలేంద్ర అంటాడు. అసలు యాభై లక్షల ప్రాబ్లమ్ క్రియేట్ చేసిందే నువ్వు అని నేను చెప్తానని మను అనగానే శైలేంద్రకి దిమ్మతిరిగిపోద్ది. అసలు ఒక ఆడపిల్లని అలా అల్లరి పాలు చెయ్యడానికి మీకు సిగ్గు లేదా అంటు శైలంద్ర, రాజీవ్ లని మను తిడుతాడు. మరొకవైపు మను చేసిన పనికి వసుధార చాలా కోపంగా ఉంటుంది. అసలు మను చేసిన తప్పేంటని మహేంద్ర అంటాడు. నాకు అలా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదు.. పైగా రిషి సర్ పక్కన లేడని వసుధార అంటుంది. రిషి సార ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావ్.. నేను నమ్ముతున్నాను.. మరి ఇంకేంటని మహేంద్ర అంటాడు. రిషి సర్ వచ్చేవరకు నాకు సెలబ్రేషన్స్ లేవు.. ఈ విషయంలో అసలు కన్విన్స్ అవ్వనని వసుధార చెప్పేసి వెళ్ళిపోతుంది.
మరొకవైపు డిస్సపాయింట్ గా శైలేంద్ర ఇంటికి వస్తాడు. తనతోనే ఇంటికి వచ్చిన ధరణి మీరు మారిపోయారు. చాలా గ్రేట్ వసుధార పుట్టినరోజని గుర్తు పెట్టుకొని పోస్టర్లు వేయించారని ధరణి అంటూ ఉంటే.. శైలంద్రకి కోపం వస్తుంది. అదే విషయం ధరణి దేవయానికి చెప్పి కాఫీ తీసుకొని రావడానికి వెళ్తుంది. ఆ తర్వాత దేవయానికి శైలేంద్ర జరిగింది మొత్తం చెప్తాడు. ప్రతిసారీ వాడు ఎందుకు మధ్యలో వస్తున్నాడని దేవయాని అంటుంది. మరొకవైపు మను, మహేంద్ర ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు. నువ్వు వసుధార బర్త్డే సెలెబ్రేషన్స్ కి అన్ని ఏర్పాట్లు చెయ్ నేను చూసుకుంటానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధారకి ఇష్టం లేకుండా చేస్తే తిడుతుందని మహేంద్రతో అనుపమ అంటుంది. తనకి అంటు ఇలాంటివి సరదాగా ఉండకూడదా. అందుకే ప్లాన్ చేశాను.. రేపు సెలెబ్రేషన్స్ సక్సెస్ అవుతాయి చూడు అని అనుపమతో మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |